బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (19:54 IST)

ఆ జాబితాలో పీవీ సింధుకు 12వ స్థానం..

pv sindhu
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న క్రీడాకారిణి జాబితాలో చోటు దక్కించుకుంది. 
 
ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందుతున్న 25మంది అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు 12వ ర్యాంక్‌లో నిలిచింది. 
 
27 ఏళ్ల పీవీ సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధించడంతోపాటు క్రీడారంగంలో ఇప్పటివరకు రూ.59 కోట్లు సంపాదించడం గమనార్హం. దీని తర్వాత ఆమె అత్యధిక పారితోషికం పొందిన మహిళా క్రీడాకారిణి జాబితాలో 12వ స్థానంలో నిలిచింది. 
 
ఈ జాబితాలో జపాన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నవోమీ ఒసాకా మొదటి స్థానంలో నిలవగా, సెరెనా విలియమ్స్‌ రెండో స్థానంలో నిలవడం గమనార్హం.