శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 మార్చి 2022 (18:26 IST)

పీవీ సింధు ఖాతాలో మరో టైటిల్ - స్విస్ ఓపెన్ విజేత...

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఖాతాలో మరో టైటిల్ వచ్చి చేరింది. స్విస్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీలో విజేతగా నిలించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి బుసానన్‌పై 21-16, 21-8 తేడాతో విజయభేరీ మోగించింది. మొత్తం 49 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో పీవీ సింధు ఆది నుంచి ఆధిపత్యం చూపించింది. 
 
దీంతో ఈ టోర్నీ విజేతగా నిలిచారు. ఇది సింధుకు రెండో టైటిల్. ఈ యేడాది జనవరిలో సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీని పీవీ సింధు కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. అదేసమయంలో ఇటీవల జరిగిన జర్మన్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీల్లో సింధు ఓటమిని చవిచూసిన విషయం తెల్సిందే.