మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మే 2023 (12:07 IST)

రెజ్లర్లు రోడ్డున పడ్డారు.. అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ ఫైర్

Wrestlers
Wrestlers
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. 
 
దీనిపై అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ స్పందించింది. ఇన్నాళ్ల పాటు రెజ్లర్లు రోడ్డున పడినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ మాత్రం ప్రస్తుతం స్పందించింది. 
 
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లు నిర్భంధించడాన్ని కూడా ఖండించింది. అలాగే రెజ్లింగ్ సమాఖ్యకు 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని.. లేకపోతే సస్పెన్షన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. 
 
రెజ్లర్లతో వ్యవహరించిన తీరు.. వారు నిర్భంధాన్ని ఖండిస్తున్నామని.. అలాగే లైంగిక వేధింపుల ఆరోపణలపై చేస్తోన్న దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందని అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ పేర్కొంది.