పాలకోవా ఎలా తయారుచేయాలి?
కావలసిన పదార్థాలు
పాలు 1 లీటరు
పంచదార 1 కిలో
తయీరుచేయడం ఎలా?
పాలను వెడల్పుగా వుండే గిన్నెలో లేదా పళ్లెంలో వేసి సెగపై దోర ఎరుపు వచ్చేవరకూ కాచాలి. పాలలో వున్న నీళ్లన్నీ ఆవిరయ్యాక పాలు ముద్దగా మారుతుంది. ఇలా ముద్ద అవుతున్న సమయంలో పంచదార పోసి కలియబెట్టాలి. అలాచేస్తూ కొద్దిసేపటి తర్వాత అది కోవా ముద్దలా మారుతుంది. ఆ తర్వాత పొయ్యి నుంచి దించి చిన్నచిన్న బిళ్లలుగా కట్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా చేసుకోగలగిన స్వీట్.