శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2023 (18:21 IST)

64 మంది ఎమ్మెల్యేలూ సీఎం క్యాండిడేట్లే: శ్రీధర్ బాబు

Sridhar babu
Sridhar babu
కాంగ్రెస్‌లో గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలూ సీఎం క్యాండిడేట్లే అని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి వారు అనుకుంటే సరిపోదని.. సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. 
 
తెలంగాణ తదుపరి సీఎం ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. 
 
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన హైదరాబాద్ వచ్చాక రేవంత్ రెడ్డి పేరును ప్రకటించనున్నారు.