సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (11:32 IST)

మవోలతో లింకులు : ఏపీ హైకోర్టు అడ్వకేట్ అరెస్టు

మావోయిస్టులతో సంబంధాలు కలిగివున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూది ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అడ్వకేట్ పేరు అంకాల పృథ్వీరాజ్. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో పోలీసులు మంగళవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
 
మావోయిస్టుల లింకులపై పృథ్విరాజ్ వద్ద విచారించగా, పూసుగుప్ప - చత్తీస్‌గఢ్‌లోని రాంపురం - మల్లంపేట అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేత దామోదర్‌ను కలిసి వస్తున్నట్టుగా వెల్లడైందని పోలీసులు తెలిపారు. 
 
మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన శైలేంద్ర ముఖర్జీ ఆగస్టు 7న చనిపోయాడు. ఆయన ఆశయాలను కొనసాగించాలని ఉన్న కరపత్రాలను ఆయన నుంచి స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.