గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 మే 2022 (19:46 IST)

కేఏ పాల్‌పై దాడి: పాల్‌పై చెంపదెబ్బ..

ka paul
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
 
కేఏ పాల్‌ వస్తున్నారనే సమాచారంతో ముందుగా జిల్లా సరిహద్దుకి చేరుకున్నారు టీఆర్‌ఎస్‌ నాయకులు, జిల్లా సరిహద్దులోని సిద్దిపేట జిల్లా జక్కపూర్ గ్రామం వద్ద ఆయన్ని అడ్డుకున్నారు. 
 
డీఎస్పీ పక్కనే ఉండగా.. ఓ వ్యక్తి వచ్చి పాల్‌పై దాడి చేశాడు. పాల్‌ చెంపపై కొట్టాడు. ఇక, వెంటనే అప్రమత్తమైన ఆయన అనుచరులు అతడిని అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసుల ఎదుటే టీఆర్ఎస్‌ శ్రేణులు నాపై దాడి చేశారని మండిపడ్డారు కేఏ పాల్.. పోలీసులు మీరు ప్రభుత్వ ఉద్యోగులా? లేక టీఆర్ఎస్‌ కార్యకర్తలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.