ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 13 జనవరి 2020 (08:24 IST)

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులకు క్లీన్ చిట్

డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులంతా బాధితులుగా పేర్కొన్నారు ఎక్సైజ్ శాఖ, సిట్ అధికారులు. టాలీవుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో సిని ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చారు అధికారులు. డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులంతా బాధితులుగా పేర్కొన్నారు ఎక్సైజ్ శాఖ, సిట్ అధికారులు.

డ్రగ్స్ కేసులో ఇప్పటికే సిట్ చార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఇంతవరకు కోర్టుకు మాత్రం డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఫోరెన్సిక నివేదిక చేరలేదు. టాలీవుడ్‌లో పలువురు ప్రముఖులపై డ్రగ్స్ కేసు నమోదైంది. వారిని అధికారులు పిలిపించి ప్రత్యేకంగా విచారణ కూడా చేపట్టారు.

అయితే మూడేళ్లుగా నడుస్తున్న ఈ కేసు మాత్రం ఎటూ తేలలేదు. అయితే ఆర్టీఐ ద్వారా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచారం కోరిన ఎక్సైజ్ శాఖ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. డ్రగ్స్ కేసును నీరుగారుస్తున్నారని గతంలో సీఎస్‌కు పలువురు ఫిర్యాదులు కూడా చేశారు.
 
అయితే గతంలో కూడా డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇలాంటి వార్తలే వచ్చాయి. దీంతో వాటిలో వాస్తవం లేదని ఎక్సైజ్ శాఖ అధికారులు ఖండించారు. మేం ఎవరికి ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు సినీ ఇండస్ట్రీనే కుదిపేసింది.