బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం: తొమ్మిది మంది మృతి
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఓ ఐదేళ్ల చిన్నారి ఉన్నట్లు తెలిసింది.
మృతుల్లో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిసింది. మరో 15 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. ప్రస్తుతం మృతదేహాల గుర్తింపు జరుగుతోంది.
బజార్‌ఘాట్‌లోని నాలుగు అంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో డీజిల్ డ్రమ్ముల్లో చెలరేగిన మంటలతో ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
సెల్లార్‌లోని కార్ల షెడ్‌లో రసాయనాలను పెద్ద ఎత్తున నిల్వ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు.