బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (14:05 IST)

కార్వీ కేసులో ఈడీ దూకుడు - విస్తృతంగా తనిఖీలు

హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన కార్వీ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. కార్వీ సంస్థలపైన ఈడీ విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం దాదాపు 16 చోట్ల కార్వీ సంస్థలపై ఈడీ అధికారులు సోదాలు చేశారు. 
 
ముఖ్యంగా, హైదరాబాద్‌లోని కార్వీ, దానికి సంబంధించిన పది అనుబంధ సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి. నగరంలోని ప్రధాన కార్యాలయంతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కార్వీ సంస్థపై ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిదే. 
 
కార్వీ చైర్మన్ పార్థసారథిని ఇప్పటికే మూడు రోజుల పాటు విచారించిన ఈడీ... మూడు వేల కోట్ల రూపాయల నిధుల గోల్మాల్‌పై ఆరా తీస్తోంది. కార్వీపై ఇప్పటికే సీసీఎస్‌లో ఐదు కేసులు నమోదు నమోదు అయ్యాయి. పార్థసారథి ఇంటితో పాటు ఇప్పటికే అరెస్టయిన ఐదుగురు ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.