శనివారం, 2 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (09:45 IST)

లేడీ ఎస్సై చల్లా అరుణ దౌర్జన్యం.. ఖమ్మంలో దారుణ ఘటన

తె లంగాణలోని ఖమ్మం జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లేడీ ఎస్సై చల్లా అరుణ దౌర్జన్యానికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారంగా మారింది. స్థానికంగా నెలకొన్న.. ఒక భూ వివాదంలో లేడీ ఎస్సై.. ఓ యువకుడిని స్టేషన్‌కు పిలిచి, ఇష్టమొచ్చినట్లు తిట్టి ఆ తర్వాత చితకబాదింది. 
 
బాధితుడి బొటనవేలు విరిగిపోయేలా లాఠీతో తీవ్రంగా ఇష్టమొచ్చినట్లు కొట్టింది. తన తప్పు లేకున్నా స్టేషన్‌కు తీసుకువచ్చి, అమానుషంగా ప్రవర్తించారని బాధితుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
 
సివిల్ వివాదంలో కలగజేసుకోవడమే కాకుండా స్టేషన్‌కు పిలిచి నోటికొచ్చినట్లు తిడుతూ, విచక్షణారహితంగా కొట్టిందంటూ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.