1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (10:02 IST)

శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం.. రూ. 2 కోట్ల ఆస్తి నష్టం

srisailam temple
శ్రీశైలంలో బుధవారం అర్ధరాత్రి దాటిన ఎల్‌ బ్లాక్‌ కాంప్లెక్స్‌లోని లలితాంబిక స్టోర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా చుట్టుపక్కల ఉన్న 15 దుకాణాలను చుట్టుముట్టాయి. వెంటనే సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది వేగంగా వచ్చి మంటలను అదుపు చేశారు. 
 
అదనపు సహాయక చర్యలు కూడా చేపట్టారు. శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం ఆస్తి నష్టం రూ. 2 కోట్లు. మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.