మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (22:02 IST)

పురుగులు మందు తాగి నవ వరుడు ఆత్మహత్య

suicide
నవవరుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామలోని పెద్దపహాడ్‌లో చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటకు మళ్లీ వైభవంగా పెళ్లిచేస్తానంటూ యువతి తండ్రి వారిని నమ్మించి గ్రామానికి రప్పించాడు. అయితే యువతిని పంపకుండా వేధింపులకు గురిచేయడంతో వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా.. ఈ వ్యవహారాన్ని పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని సూచించారు. 
 
అమ్మాయి పేరుపై ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేయాలని పెద్ద మనుషుల తీర్మానించగా.. అందుకు యువతి తండ్రి అంగీకరించలేదు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన వరుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.