గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 జులై 2021 (10:01 IST)

కేసీఆర్ దంపతుల పంచలోహ విగ్రహం : మంత్రి కేటీఆర్‌కు బహుమతి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - శోభ దంపతుల పంచలోహ చిత్రాలతో ఓ చిత్రపటాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. దీన్ని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తయారు చేయించారు. ఈ పంచలోహ చిత్రపటాన్ని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు అందేశారు. ఇటీవల కేటీఆర్ పుట్టిన రోజు వేడుక జరిగింది. ఆ రోజన ఈ పటాన్ని అందజేశారు. 
 
ఇద్దరు ప్రముఖ శిల్పులు 3 నెలల పాటు శ్రమించి దీనిని తయారు చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేటీఆర్‌ పుట్టినరోజు నాడు మహబూబ్‌నగర్‌లో ముక్కోటి వృక్షార్చన, రక్తదానం, దివ్యాంగులకు త్రిచక్ర మోటారు వాహనాలను పంపిణీ చేశామన్నారు. 
 
ఈ సందర్భంగా కేటీఆర్‌ ఇది తనకెంతో అపురూపమైన కానుక అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసగౌడ్‌ కుమార్తెలు శ్రీహిత, శ్రీహర్షితలు కూడా పాల్గొన్నారు.