ఈ-పాస్ ఉంటేనే తెలంగాణాలోకి అడుగుపెట్టండి : టీఎస్ పోలీస్
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘాను మరింత పటిష్టం చేశారు. సరిహద్దు జిల్లా అయిన సూర్యాపేట సరిహద్దుల్లో జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ తనిఖీ చేశారు.
ఈ సందదర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆంధ్రా నుంచి తెలంగాణలోకి వచ్చే వారికి e-పాస్ అనుమతి తప్పనిసరి అన్నారు. ఉ.6 గంటల నుంచి ఉ.10 గంటల సమయంలో కూడా ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌లకు అనుమతులు యథావిధిగా కొనసాగుతాయని అన్నారు.
అలాగే మేల్లచెరువు, చితలపాలెం, మఠంపల్లి, పాలకవీడు మండలాల్లో ఉన్న ఆంధ్ర-తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దుల్లో అత్యవసర సేవలు మినహాయించి ఇతర అన్ని సాధారణ రాకపోకలను 24 గంటలు నిషేధించామన్నారు. కొంత మంది వాహనదారులు, ప్రజలు లాక్‌డౌన్ మినహాయింపు సమయాన్ని ఆసరాగా చేసుకుని అనవసరంగా సరిహద్దులు దాటుతున్నారు.
అలాగే ఆంధ్రా నుంచి ఎ
లాంటి అనుమతి లేకుండా ఉదయం 4 నుంచి 6 గంటలోపు రామాపురం క్రాస్ రోడ్డు అంతరాష్ట్ర చెక్ పోస్ట్‌కు చేరుకుని అక్కడే 6 గంటల వరకు వేచి ఉండి మినహాయింపు సమయంలో తెలంగాణలోకి వస్తున్నారు.
ఈ కారణం చేత వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఆంక్షలను కఠినతరం చేశామని ఎస్పీ తెలిపారు. తెలంగాణాలోకి రావాలంటే ఏ సమయంలోనైనా ఈ-పాస్ ఉండాలన్నారు. దీనిని ప్రజలు గమనించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.