ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (08:18 IST)

ఇడుపులపాయ ట్రిబుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

suicide
కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఉన్న ట్రిపుల్ ఐటీలో విద్యాభ్యాసం చేస్తున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నా గంగారాం అనే వ్యక్తి ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
 
వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలం, తేర్పాంపల్లె దళితవాడకు చెందిన నేర్జాంపల్లె గంగారాం (21) ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నాడు. మంగళవారం తన హాస్టల్ గదిలోనే గంగారం ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
గది తలుపులు వేసి వుండటంతో అనుమానించిన తోటి విద్యార్థిలు కిటికీలోంచి చూసి షాకయ్యారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న గంగారాంను చూసి హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం చేయవేయగా, వారు వచ్చి గంగారాం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి పంపించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.