గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జులై 2023 (11:25 IST)

గురుకుల అభ్యర్థులకు అలర్ట్.. తుది షెడ్యూల్-ఆగస్టు 1 నుంచి ఆగస్టు 23..?

Jobs
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఈఐఆర్బీ) ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదలయ్యాయి. మొత్తం 9,120 పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
 
తెలంగాణలోని గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీల భర్తీకి ఆగస్టులో పరీక్షలు జరగనున్నాయి. అయితే తాజాగా షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేసింది. తుది షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 23 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లు జరుగుతాయి. 
 
ఉదయం 8.30 గంటల నుంచి ఉదయం 10.30 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు రెండో షిఫ్ట్, సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూడో షిఫ్ట్ ఎగ్జామ్ ఉంటుంది.