మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 జనవరి 2023 (14:56 IST)

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల..

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 25,050 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు.మెయిన్స్ పరీక్షలు జూన్‌ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్నారు. 
 
పరీక్ష షెడ్యూల్‌ను జనవరి 18వ తేదీన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ  వెబ్ సైట్ లో పొందుపరుచనున్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది. 
 
మొత్తం 503 గ్రూప్ 1 పోస్టులకు అక్టోబర్ 16 ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించింది. ఈ పోస్టులకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,85,916 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అక్టోబర్ 29న ప్రాథమిక కీని విడుదల చేసింది.