గురువారం, 7 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (14:56 IST)

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : తెరాస కీలక నిర్ణయం

kcrao
ఉపరాష్ట్రపతి త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ధన్కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరేట్ అల్వాలు పోటీ చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే విషయంపై తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి ఉన్న అల్వాకు మద్దతు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం మేరకు తెరాసకు చెందిన మొత్తం 16 మంది తెరాస ఎంపీలు మార్గరేట్ అల్వాకు ఓటు వేయనున్నారు. ఈ విషయాన్ని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు వెల్లడించారు.