1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (14:08 IST)

ఓటుకు నోటు కేసు.. రేవంత్ రెడ్డికి నోటీసులు

ఓటుకు నోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టు సమన్లు జారీ అయ్యాయి. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఈడీ కేసులు విచారణ జరిపే నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు సమన్లు జారీ చేసింది. 
 
ఇందులో భాగంగా అక్టోబర్‌ 4న విచారణకు రావాలని నోటీసలో  పేర్కొంది. ఓటుకు నోటు కేసులో ఈడీ ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు రేవంత్‌తో పాటు తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సమన్లు పంపింది. 
 
వీరితో పాటు కోర్టు సమన్లు జారీ చేసిన వారిలో సెబాస్టియన్‌, ఉదయ్‌సింహ, మత్తయ్య జెరుసలేం, వేం కృష్ణ కీర్తన్‌లు ఉన్నారు.