శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:20 IST)

అవసరమైతే ఇంకా అప్పులు తెస్తాం: సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రగతికి అవసరమైతే... ఇంకా ఇప్పులు తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తెచ్చిన అప్పులు దేనిమీద వ్యయం చేస్తున్నామో ప్రతిపక్షాలు గమనించాలని సూచించారు. గత కాంగ్రెస్ పాలనకంటే తెరాస ప్రభుత్వం ఎంతో మేలని ప్రజలు చెబుతున్నట్లు కేసీఆర్ తెలిపారు.

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికపై భట్టివిక్రమార్క చేసిన వ్యాఖ్యలు తప్పని చెప్పారు. తాము ప్రజలను నమ్ముకున్నామని అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస భారీ మెజార్టీతో గెలిచిందన్నారు. సాహసం, త్యాగలమీదే గులాబీ పార్టీ పుట్టిందని... రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయడానికైనా సిద్ధమని సీఎం కేసీఆర్ వివరించారు.

అప్పులను లెక్కలతో సహా వివరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతికి అవసరమైతే... ఇంకా అప్పులు తెస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కౌలుదారులను గుర్తించే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం ఉందని.. రైతుల భూమి కాపడుతామని సీఎం అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం అసెంబ్లీలో ‘ద్రవ్య వినిమయ బిల్లు’ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ చట్టంపై సీఎం మాట్లాడుతూ.. కౌలుదారులు ఎప్పటికప్పుడు మారుతున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఇచ్చిన భూపరిహారం.. మహబూబ్‌నగర్‌లో ఎలా ఇస్తామని వివరించారు.

రిజిస్ట్రేషన్ విలువ, చట్టం ప్రకారం భూపరిహారం ఇస్తామని ప్రకటించారు. ఆర్థికమాంద్యం ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘ద్రవ్య వినిమయ బిల్లు’ పై ఎంఐఎం ఎమ్మెల్యే ముజాంఖాన్ చర్చ ప్రారంభించిన విషయం తెలిసిందే. 
 
ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత సీఎం కేసీఆర్ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. చర్చ జరిగిన అనంతరం సభ్యులు ఆమోదం తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.

సీఎం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగిన అనంతరం బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ప్రజాపద్దుల సంఘం, అంచనాల సమితి, ప్రభుత్వ రంగ సంస్థల సమితి సభ్యులను సభాపతి పోచారం ప్రకటించారు.

ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్గా ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, అంచనాల కమిటీ ఛైర్మన్గా సోలిపేట రామలింగారెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల సమితి ఛైర్మన్గా ఆశన్నగారి జీవన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జోనల్ కన్సల్టెన్సీ కమిటీ సభ్యునిగా నన్నపనేని నరేందర్ను నియమించారు. అనంతరం శాసన సభను స్పీకర్ నిరవధిక వాయిదా వేశారు.