బాలీవుడ్ హీరోయిన్‌నే ఫాలో అవుతున్న టాలీవుడ్ హీరో ఎవరు?
హీరో సాయిధరమ్ తేజ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను ఫాలో కావాలని చూస్తున్నారట. ఆ బాలీవుడ్ హీరో దారిలోనే నడుస్తూ రికార్డులను బద్దలు కొట్టాలని చూస్తున్నాడట. అందుకోసం ఒక ప్రముఖ కంపెనీతో బేరం కుదుర్చున్నాడట సాయిధరమ్ తేజ్.
సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, దర్సకుడు దేవఘట్ట తెరకెక్కిస్తున్న సినిమా రిపబ్లిక్. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నారట. ఆయనకు జోడీగా తమిళ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారట. జగపతి, రమ్యక్రిష్ణలు ఇతర కీలకపాత్రలో నటిస్తున్నారట.
ఇక ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడింది. దీంతో ఈ మూవీ మేకర్స్ ఓటిటిని ఆశ్రయించాలని చూస్తున్నారట. హీరో సల్మాన్ ఖాన్ రాధే సినిమాను ఓటిటిలో రిలీజ్ చేసినట్లు రిపబ్లిక్ కూడా రిలీజ్ చేయాలని ఈ మూవీమేకర్స్ భావిస్తున్నారట.
అందుకోసం ఒక ప్రముఖ కంపెనీతో మంతనాలు జరిపి రికార్డ్ లెవల్‌లో డీల్ కూడా కుదర్చుకున్నాడట సాయిధరమ్ తేజ్. అంతే కాదు థియేటర్ వసూళ్ళ కోసం ఈ డీల్‌తోనే రిపబ్లిక్ మూవీ మేకర్స్ ఎక్కువగా లాభపడ్డారట. ఇప్పుడిదే విషయం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.