మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 5 ఆగస్టు 2020 (17:20 IST)

మహేష్‌ బాబు మూవీలో విజయ్ హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి గీత గోవిందం సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత చాలా కథలు విని ఆఖరికి మహేష్ బాబు పరశురామ్ చెప్పిన కథకు ఓకే చెప్పారు.
 
కరోనా రాకపోతే ఈపాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి. కరోనా తగ్గే వరకు షూటింగ్‌కి రాలేనని మహేష్ చెప్పడంతో ఎప్పటి నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందో చెప్పలేని పరిస్థితి.
 
 ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించనుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కియారా కాదు.. కీర్తి సురేష్ నటించనున్నట్టు టాక్ వచ్చింది. కీర్తి సురేష్‌ నటించడం అనేది దాదాపు ఖాయం అని టాక్.
 
ఇదిలా ఉంటే.. ఇందులో మరో కథానాయిక పాత్ర కూడా ఉందట. ఆ పాత్రకు బాలీవుడ్ భామ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న అనన్య పాండే అయితే కరెక్ట్ ఉంటుందని అనుకుంటున్నారట. పరశురామ్ ఫుల్ స్రిప్ట్ రెడీ చేసి మహేష్ ఎప్పుడంటే అప్పుడు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉన్నాడు. అనన్య పాండేకు ఈ మూవీలో నటించే అవకాశం వస్తే... లక్కీ ఛాన్స్ సొంతం చేసుకున్నట్టే.