ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (15:13 IST)

ధనుష్‌ సినిమాలో అర్జున్ రెడ్డి హీరోయిన్?

Shalini Pandey
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవలే "రాయాన్"తో హిట్ అందుకున్నాడు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు. తాజాగా మరో చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నట్టు ప్రకటించారు. 
 
"ఇడ్లీ కడై" అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్, నిత్యామీనన్ జంటగా నటించనున్నారు. దర్శకుడిగా కూడా ధనుష్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందులో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే రెండో కథానాయికగా ఎంపికయ్యే అవకాశం వుంది. 
 
ఈ సినిమా ద్వారా షాలినీ పాండేకు బిగ్ బ్రేక్ వస్తుందని టాక్ వస్తోంది. అర్జున్ రెడ్డి, 118, నిశ్శబ్ధం వంటి చిత్రాల్లో కనిపించిన షాలినీ పాండేకు ఆపై మంచి అవకాశాలు రాలేదు.