సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2023 (22:25 IST)

మళ్లీ సింగర్‌గా మారనున్న పవన్ కల్యాణ్..? (video)

Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీబిజీగా వున్నారు. ఇందులో పాన్-ఇండియన్ చిత్రం హరి హర వీర మల్లు వుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. 
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం ఒక పాట పాడబోతున్నారు. ఇందుకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అతి త్వరలో రికార్డింగ్ జరగనుంది. గతంలో పవన్ కళ్యాణ్ జానీ, అత్తారింటికి దారేది, తమ్ముడు, గుడుంబా శంకర్, అజ్ఞాతవాసి, పంజా వంటి పలు సినిమాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. 
 
ఇక దర్శకుడు క్రిష్ హరి హర వీర మల్లు చిత్రాన్ని పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ మొఘల్ కాలం నాటి దొంగగా కనిపించబోతున్నాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.