గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 30 జనవరి 2020 (21:52 IST)

అవకాశాల కోసం అది చేత్తో పట్టుకుని కూర్చున్న నటి

బిగ్‌బాస్ షోలోకి వస్తే ఎలాంటి పేరు వస్తుందో గత మూడు సీజన్లతో అందరూ ఒక అంచనాకు వచ్చేసి ఉంటారు. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న వారికీ, గెలిచిన వారికీ ఏ ఒక్కరికీ కూడా అంతగా కలిసి రాలేదు. అంతోఇంతో మూడో సీజన్ విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ కెరీర్ మాత్రం బాగానే కలిసొచ్చింది. అయితే మిగిలిన వారందరికీ చిన్నా చితకా క్యారెక్టర్లు మాత్రమే వస్తున్నాయి. మరికొందరికీ అది కూడా లేదు. అయితే తాజాగా ఒక బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోందట. ఆమె ఎవరో కాదు తేజస్వి. 
 
బిగ్‌బాస్ అన్ని సీజన్లలో కన్నా రెండో సీజన్ మజాగా నడిచింది. గొడవలు జరగని రోజంటూ లేదు. ఎవరో ఒకరు తిట్లు తిట్టుకుంటేనే ఉండేవారు. అందులోనూ తేజస్వీ గొంతు ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. తేజస్వీ.. కౌశల్ మాటల యుద్ధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అయ్యేది. 
 
కౌశల్‌పై తేజస్వీ ఆరోపణలు చేయడం, మాటల దాడి చేయడంతో ప్రేక్షకులకు ఎక్కడ లేని కోపమొచ్చేది. అయితే అదంతా నడుస్తుంగానే ఆమె మధ్యలోనే నిష్క్రమించడంతో కొందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆ తరువాత బుల్లితెరపైన దృష్టి పెట్టింది తేజస్వి.
 
బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన తేజస్వీకి బుల్లితెరపై కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే ఆ క్యారెక్టర్లు కాస్త తనకు పెద్దగా కలిసి రాలేదు. ఇక సినిమా అవకాశాలా అస్సలు రాకుండా పోయాయట. దీంతో తేజస్వి ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోందట. ఎవరు అవకాశమిస్తారా అని ఫోన్ చేత్తో పట్టుకుని కూర్చుందట తేజస్వి. మరి తేజస్వికి ఫోన్ చేసి అవకాశాలు ఎవరు ఇస్తారో చూడాలి.