శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 3 అక్టోబరు 2020 (12:04 IST)

అనుష్క నిశ్శబ్దం చూసిన ప్రేక్షకులు నిశ్శబ్దం, కదిలించినా మాట్లాడటంలేదట, ఎందుకని?

బాహుబలి చిత్రం తర్వాత అనుష్కని మరో పాత్రలో చూళ్లేకపోతున్నారు ప్రేక్షకులు. అందుకేనేమో ఆమె నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం చిత్రం చూసి సైలెంట్ అయిపోతున్నారట. విషయం ఏంటంటే... ఇటీవలే ఓటీటీ ద్వారా రిలీజ్ అయిన నిశ్శబ్దం చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారట. చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదని అంటున్నారు.
 
దక్షిణాది సినీ ఇండస్ట్రీల నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో స్టార్, సీనియర్ క్యాస్టింగ్ ఉన్న సినిమాలు ఏమాత్రం సక్సెస్ కాలేకపోతున్నాయి. పెంగ్విన్, వి చిత్రాలు ఎలాంటి హైప్‌తో వచ్చి ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయో తెలుసు. ఐతే అనుష్క మెయిన్ లీడ్లో హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో నిన్న రాత్రి ప్రీమియర్స్‌తో రిలీజై నిరాశను మిగిల్చింది. మరి రాబోయే చిత్రాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాల్సిందే.