కిరణ్ అబ్బవరంతో డీప్ లిప్ కిస్.. ఆ సినిమాకు బాగా కలిసొస్తుందిగా?  
                                       
                  
                  				  'సమ్మతమే' చిత్రంలో కిరణ్ అబ్బవరంతో డీప్ లిప్ కిస్‌తో సంచలనం రేపింది యంగ్ బ్యూటీ చాందిని చౌదరి. ఈ నెల 24న విడుదలకు సిద్ధమైన ఈ మూవీ నుంచి ఇటీవలే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
				  																												
									  
	 
	ప్రత్యేకించి అందరూ కారులో చాందిని ముద్దుసీన్ పైనే ఫోకస్ చేస్తుండగా.. ప్రస్తుతం ఇదే విషయంలో తను ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. అవకాశాల కోసమే హద్దు మీరి ప్రవర్తిస్తోందని, మందు, సిగరెట్, సెక్స్ సీన్లకు రెడీ అయిపోయిందంటూ నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
				  
	 
	ఇదే క్రమంలో ఆమెకు మద్ధతుగా కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. స్టార్ నటీమణులు సైతం సక్సెస్ కోసం తమ కెరీర్‌లో ఎన్నో బోల్డ్ అటెంప్ట్స్ చేశారు' అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ముద్దు సీను హాట్ టాపిక్‌గా మారడంతో ఈ సినిమాకు బాగానే ప్రమోట్ అవుతోంది.