గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (10:19 IST)

దేవర కోసం అండర్ వాటర్ సీన్స్ ఎలా తీస్తారో తెలుసా!

Under water camera with ratnavel
Under water camera with ratnavel
ఎన్.టి.ఆర్., జాన్వీకపూర్ నటిస్తున్న దేవర సినిమా కోసం కొన్ని అండర్ వాటర్ సీన్స్ ను ఇటీవలే చిత్రించారు. ఇందుకు 80 కోట్ల ఖరీదు చేసే కెమెరాను ఉపయోగించారు. దానిని సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు డీల్ చేస్తున్నారు. ఈ కెమెరా తో ఇప్పటి వరకు ‘జాన్ విక్ 4 ‘, ‘ది బ్యాట్ మ్యాన్’,’జోకర్’, ‘యాంట్ మ్యాన్’, ‘స్ట్రేంజర్ థింగ్స్’, ‘డ్యూన్’ మరియు ‘టెర్మినేటర్’ వంటి హాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించారు.
 
ఆయన అండర్ వాటర్ సీన్ ఫొటో షేర్ చేశారు. సముద్రంలో జరిగే కథ కనుక అక్కడ యాక్షన్ సీన్స్ కొన్ని తీస్తారు. అయితే ఇంకా దగ్గరగా లోపల సీన్స్ చేయాలంటే ఇలా చేస్తామని తెలిపారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా వుండబోతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం గురించి తాజా అప్ డేట్ దీపావళికి రానున్నది.