శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2019 (21:54 IST)

రామకృష్ణా స్టూడియోలో వంగ‌వీటి రంగా

నటరత్న నందమూరి తారక రామారావు స్థాపించిన రామకృష్ణా స్టూడియో చాలా మందికి ఎన్నో మధుర స్మృతులను మిగిల్చి ఉంటుంది. అలాంటి వారిలో ఇప్పుడు పత్రికాధిపతి, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి కూడా చేరిపోయారు. ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్న ‘దేవినేని’ చిత్రం షూటింగ్   రామకృష్ణా స్టూడియోలో జరిగింది. 
 
ఈ సందర్భంగా తనకు ఈ స్టూడియో మిగిల్చిన మధురానుభూతిని సురేష్ కొండేటి పంచుకుంటూ ‘ఈ స్టూడియోలో ఎన్నో భారీ చిత్రాలను నిర్మించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుగారిని ఒకప్పుడు ఇదే స్టూడియోలో ఓ జర్నలిస్టుగా కలిశాను. ఎన్నో సినిమా షూటింగుల కవరేజిని జర్నలిస్టుగా చేశాను. ఇప్పుడు నటుడిగా ఈ స్టూడియోలో అడుగుపెట్టాను. ఓ వ్యక్తికి ఇంతకన్నా కావలసిన మధురానుభూతి ఏముంటుంది. ఈరోజు ఓ కొత్త శక్తి నాలో ప్రవేశించినట్లు అనిపించింది’ సురేష్ కొండేటి అన్నారు.
 
బెజ‌వాడ పేరెత్తితే వినిపించే పేర్లు వంగ‌వీటి రంగా.. దేవినేని నెహ్రూ. ఇప్పుడు ఆ ఇద్ద‌రి క‌థ‌తోనే ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మంగళవారం రోజు సురేష్ కొండేటి, శివారెడ్డి, తేజ తదితరులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. శివ‌నాగు ద‌ర్శ‌క‌త్వంలో ఆర్‌టి‌ఆర్ ఫిలింస్ పతాకంపై  రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. దేవినేని నెహ్రూగా టైటిల్ పాత్ర‌లో నందమూరి తారకరత్న నటిస్తుండగా ..వంగవీటి రంగా పాత్రను సురేష్ కొండేటి పోషిస్తున్నారు.