సంబంధిత వార్తలు
- సమంతకు పెళ్లయ్యాక కూడా ఎంతో క్రేజీగా... నాకా అవకాశం లేదన్న నిహారిక
- మహేష్ బాబును బెదిరించినా లేక 200 కోట్లు ఇచ్చినా నమ్మందే ఏది చెయ్యడు
- నా కొడుకు పెరిగి పెద్దవాడవుతున్నాడు... చేతిలో చేయి వేసుకొని..? నిహారిక
- ‘బట్టల రామ స్వామి బయోపిక్కు`హిట్ టాక్ వచ్చినందుకు ఆనందంగా ఉందిః సతీష్ కుమార్
- నిహారికకు ఇష్టమైన ఫోటో ఇదే.. సోషల్ మీడియాలో వైరల్
అలాంటి సినిమాలే నిర్మిస్తాః నిహారిక కొణిదెల
Niharika Konidela
ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ. . కట్టా గారి విజన్ చాలా పెద్దది, గొప్పది. నాకు మంచి కంటెంట్ ప్రొడ్యూస్ చేయడం చాలా ఇష్టం. అందులో భాగంగా భారీ కమర్షియల్ సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఫ్యూచర్‌లో ఉండొచ్చు. ఆడియెన్‌గా ఎలాంటి సినిమాలు చూడాలని అనుకుంటానో.. అలాంటి సినిమాలే నిర్మించాలని చూస్తా. జీ వాళ్ల దృష్టిలో కంటెంట్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అది నేను దగ్గరగా చూశాను. నేను చేసిన ముద్దపప్పు ఆవకాయ, నాన్నకుచ్చి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మూడూ జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుండడం చాలా హ్యాపీగా ఉంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సింగిల్ థ్రెడ్ స్టోరీ. ఈ క్రెడిట్ మా డైరెక్టర్ మహేష్ గారు, రైటర్ మానస గారిదే. నాకు కథ చెప్పేటప్పుడే మహేష్ గారు నన్ను ఆ కథతో కనెక్ట్ చేసి నడిపించారు. ప్రతి సీన్ విషయంలో ఆయనకు చాలా క్లారిటీ ఉంది. రిపబ్లిక్ సినిమా చాలా హానెస్ట్ మూవీ. క్లైమాక్స్ నాకు అద్భుతంగా అనిపించింది. అన్నారు.
తర్వాతి కథనం
