మంగళవారం, 23 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (09:54 IST)

సమంత సిక్స్ ప్యాక్ ట్రై చేస్తోందా?

Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu
సమంతా రూత్ ప్రభు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మయోసైటిస్ నుండి కోలుకున్న తర్వాత, రంగస్థలం లేడీ ప్రస్తుతం జిమ్‌లో బిజీగా ఉంది. సమంత లేటెస్ట్ ఫోటో చూసి సిక్స్ ప్యాక్ ట్రై చేస్తుందా అన్నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఆమె ప్లాంక్ చేస్తున్న ఫోటోకు లైకులు వర్షం కురిపిస్తున్నారు. 
 
తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలో ఆమె బ్లాక్ వెస్ట్, గ్రే ట్రాక్ ప్యాంట్‌లో ప్లాంక్ చేస్తూ కనిపిస్తుంది. సమంత వర్కౌట్స్ చూసి రకుల్ ప్రీత్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించింది. 
 
ఇకపోతే.. గతేడాది సమంత ఎంత కష్టాలు పడిందో అందరికీ తెలిసిందే. లేడి ఓరియెంటెడ్ చిత్రం యశోద షూటింగ్ సమయంలో ఆమె మయోసైటిస్‌తో బాధపడ్డారు. ఈ చిత్రంలో ఆమె అద్దె తల్లిగా నటించింది. అక్టోబర్ 29న, ఆమె తన ఆరోగ్య పరిస్థితి గురించి ఓపెన్ చేయడం ద్వారా తన అభిమానులు, స్నేహితులను ఆందోళనకు గురిచేసింది
 
సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం వరుణ్ ధావన్, సమంత కలిసి పనిచేస్తున్నారు. ఇది కాకుండా సమంత విజయ్ దేవరకొండతో కుషీ అనే సినిమా చేస్తోంది. 
 
సమంత అనారోగ్య కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పునఃప్రారంభమైంది. ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సమంత కసరత్తు చేస్తోంది.