శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 23 మార్చి 2020 (21:11 IST)

నాగార్జున, చిరు, ఎన్టీఆర్, నాని బాటలో జగపతి...

కొత్తదనం కోసం తపించే నాగార్జున బుల్లితెర పై మీలో ఎవరు కోటీశ్వరుడు పొగ్రామ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున ఏంటి..? బుల్లి తెరపైకి రావడం ఏంటి అనుకున్నారు.. అంతే కాకుండా వెండితెర పైన సక్సస్ అయిన నాగార్జున బుల్లితెరపై రాణిస్తాడా అనే అనుమానం వ్యక్తం చేసారు కానీ... బుల్లితెరపై కూడా సక్సస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసారు. నాగార్జున తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. 
 
మీలో ఎవరు కోటీశ్వరుడు పొగ్రామ్‌కి హోస్ట్‌గా చేసి విశేషంగా ఆకట్టుకున్నారు. ఇలా.. నాగార్జున, చిరంజీవి వెండితెర మీద నుంచి బుల్లితెర మీదుకు రావడం విశేషం. అయితే.. సీనియర్ హీరోలు బుల్లితెర పైకి రావడంతో యంగ్ హీరోలు సైతం బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బిగ్ బాస్ సీజన్‌కు హోస్ట్‌గా చేయడం ద్వారా స్మాల్ స్ర్కీన్ పైన ఎంట్రీ ఇచ్చారు. 
 
మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1కు హోస్ట్ చేయడంతో ఆ షోకు సక్సెస్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 2కు కూడా ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా చేయమన్నారు కానీ.. సినిమాల్లో బిజీగా ఉండటం వలన కుదరలేదు. అప్పుడు బిగ్ బాస్ సీజన్ 2కు నేచురల్ స్టార్ నానిని హోస్ట్‌గా ఎంచుకోవడం తెలిసిందే. నాని తనదైన స్టైల్లో హోస్ట్‌గా చేసారు అయితే... సోషల్ మీడియాలో నానిపై విమర్శలు రావడంతో తర్వాత సీజన్‌కి ఛాన్స్ వచ్చినా కానీ నాని నో చెప్పారు. 
 
దీంతో బిగ్ బాస్ సీజన్ 3కి కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేయడం.. ఆ షో గ్రాండ్ సక్సస్ అవ్వడం.. రికార్డు స్ధాయిలో టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 4కు హోస్ట్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. 
 
ఇదిలా ఉంటే.. సింహస్వప్నం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి పెద్దరికం, గాయం, శుభలగ్నం, శుభమస్తు, శుభాకాంక్షలు, మావిచిగురు.. తదితర చిత్రాలతో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న కథానాయకుడు జగపతిబాబు. 
 
ఇప్పటివరకూ వెండితెర ప్రేక్షకులను అలరించిన జగపతి బాబు ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు. నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్, నానిల బాటలో జగపతి బాబు కూడా రాబోతున్నారని... బుల్లితెర మీద నిర్వహించే ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా మారబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఓ గేమ్ షోకి హోస్ట్ వ్యవహరించేందుకు ఆయన అంగకరించారని సమాచారం.