శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (14:24 IST)

కాంతారా 2 లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసా?

Kanthara
ఉగాది సందర్బంగా కాంతారావు-2కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డారు. సోషల్ మీడియాలో తాజా అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఈ ఉగాది శుభసందర్భంగా, కాంతారావు రెండవ భాగానికి రచన ప్రారంభమైందని తెలియజేశారు. 
 
ప్రకృతితో మనకున్న సంబంధాన్ని ప్రదర్శించే మరో ఆకర్షణీయమైన కథనాన్ని మీ ముందుకు తీసుకురావడానికి తాము వేచి వుండాల్సి వుంటుందని హోమబుల్ ఫిల్మ్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పేర్కొంది. నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి బాక్సాఫీస్ వద్ద వందరోజులు సాధించిన వేడుకను గుర్తుచేసే కార్యక్రమంలో కాంతారావు చిత్రం ప్రీక్వెల్‌ను ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా రిషబ్ మాట్లాడుతూ.. "కాంతారావుపై అపారమైన ప్రేమ, ఆదరణ చూపుతూ ముందుకు సాగుతున్న ప్రేక్షకులకు చాలా సంతోషంగా ఉంది. దైవానుగ్రహంతో సినిమా విజయవంతంగా 100 రోజులు పూర్తిచేసుకుని తీయాలనుకుంటున్నాను. 
 
కాంతారా ప్రీక్వెల్‌ని ప్రకటించే అవకాశం రావడం అదృష్టం. మీరు చూసినది నిజానికి పార్ట్ 2, పార్ట్ 1 వచ్చే ఏడాది వస్తుంది. నేను కాంతారావు కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఆలోచన నా మదిలో మెదిలింది. ఎందుకంటే కాంతారావు చరిత్రలో ఎక్కువ లోతు ఉంది. ప్రస్తుతం, రచన భాగానికి సంబంధించినది అయితే, మేము మరిన్ని వివరాలను కసరత్తు చేసే పనిలో వున్నాం.." అంటూ రిషబ్ శెట్టి తెలిపాడు.