కాంతార సినిమాకు అరుదైన గౌరవం..
కన్నడ నటుడు, దర్శకుడు రూపొందించిన కాంతార సినిమాకు అరుదైన గౌరవం లభించింది. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో కాంతారాను ప్రదర్శించనున్నారు. తద్వారా ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శితమయ్యే తొలి చిత్రంగా కాంతార రికార్డులకెక్కబోతోంది.
ఇందులో భాగంగా దర్శకుడు రిషబ్ శెట్టి స్విట్జర్లాండ్ చేరుకున్నారు. ఈ సినిమా స్క్రీనింగ్ తర్వాత పర్యావరణ పరిరక్షణలో భారతీయ సినిమాల పాత్రపై ఆయన ప్రసంగిస్తారు.
భారతీయ సినిమాలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాయని రిషబ్ శెట్టి అన్నారు. పర్యావరణ సవాళ్లను స్వీకరించి, సంబంధిత సమస్యలను ఇలాంటి సినిమాలు పరిష్కరిస్తాయని రిషబ్ పేర్కొన్నారు.