శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2024 (12:06 IST)

సమాజంలో మహిళలకు సరైన చోటు లేదు : మంచు లక్ష్మి

lakshmi manchu
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలకు ఎదురవుతోన్న వేధింపులపై జస్టిస్‌ హేమ కమిటీ నివేదికను ఉద్దేశించి నటి మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్‌తో ఆమె మాట్లవాడుతూ, ఈ సమాజంలో మహిళలకు సరైన చోటు లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకున్నారు. హేమ కమిటీ రిపోర్ట్‌ గురించి తనకు పూర్తిగా తెలియదని చెప్పిన ఆమె.. సమాజంలో మహిళలకు సమానత్వం ఉండాలని తెలిపారు. అన్యాయం జరిగిన వెంటనే బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
 
ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఏ మహిళైనా ఎవరితోనూ తన ఇబ్బందిని  చెప్పకోలేక  ధైర్యం చేయలేదని అనిపిస్తేనే.. ఆమెను  ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నిస్తారని, అలాంటి వారికి నో చెప్పడం నేర్చుకోవాలన్నారు. కెరీర్‌ మొదలుపెట్టిన సమయంలో తననూ కొందరు ఇబ్బంది పెట్టినట్లు.. వారితో తాను దురుసుగా ప్రవర్తించిన క్రమంలో ఉద్యోగాన్ని పోగొట్టుకున్నట్లు మంచు లక్ష్మి తెలిపారు. ఇక కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన తనని షాక్‌కు గురిచేసిందన్నారు. న్యాయం జరగాలని కోరారు.