బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (22:37 IST)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

Radhika Apte
Radhika Apte
నటి రాధికా ఆప్టే తన బేబీ బంప్‌ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఆమె గర్భవతి అనే విషయం ఎవరికీ తెలియదు. ఉన్నట్టుండి రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఆమె అభిమానులకు షాకిచ్చేలా చేసింది. 
 
ఇకపోతే... రాధికా ఆప్టే బ్రిటీష్ సంగీత స్వరకర్త బెనెడిక్ట్ టేలర్‌ను వివాహం చేసుకుని సుమారు 12 సంవత్సరాలు అయ్యింది. రాధికా ఆప్టే ఆమె భర్త తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు టాక్ వచ్చింది. 
 
ఇక ఆమె తాజా సినిమా "సిస్టర్ మిడ్‌నైట్" యూకే ప్రీమియర్ కోసం వెళ్లిన ఆమె రెడ్ కార్పెట్‌ ఫోజులిచ్చిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమెకు శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తాయి. రాధికా ఆప్టే బోల్డ్ పాత్రలకు పెట్టింది పేరు. తెలుగులో "రక్త చిత్ర", "లెజెండ్" వంటి చిత్రాల్లో నటించింది.