శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (15:48 IST)

మళ్లీ కలిసిన రాహుల్ సిప్లిగంజ్- పునర్నవి.. వీడియో వైరల్

Rahul Sipligunj_Punarnavi
Rahul Sipligunj_Punarnavi
బిగ్‌బాస్-3లో రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాహుల్ బిగ్ బాస్ 3 విజేతగా నిలిచాడు. ఇక ఆ తర్వాత పునర్నవి సినిమాలకు గ్యాప్ ఇచ్చి లండన్ వెళ్లిపోయింది. ఇక సిప్లిగంజ్ అయితే వరుసగా సినిమాల్లో పాటలు పాడుతూ చివరికి ఆస్కార్ వేదిక వరకూ వెళ్లిపోయాడు. 
 
తాజాగా చాలా ఏళ్ల తర్వాత అంటే ఎనిమిదేళ్ల తర్వాత ఈ జంట కలిసింది. పునర్నవి రాగానే ఫ్లవర్ బొకే ఇచ్చి వెలకమ్ పునర్నవి గారు అంటూ పలకరించాడు రాహుల్. 
 
అయ్యో థాంక్యా రాహుల్ సిప్లిగంజ్ గారు అంటూ సరదాగా ఆటపట్టించింది పునర్నవి. ఈ సందర్భంగా తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.