మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జనవరి 2022 (13:36 IST)

ఇన్‏స్టా స్టోరీలో సమంత పవర్ ఫుల్ మెసేజ్- ఏంటంటే?

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత తన ఇన్‏స్టా స్టోరీలో షేర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ఇతరుల అభిప్రాయాలను లెక్క చేయనక్కర్లేదని హీరోయిన్ సమంత వెల్లడించింది. ఇతరుల అభిప్రాయాలతో అవసరం లేదు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం ముఖ్యం కాదు. ఒక్కటే నిజం.. అదేంటంటే.. మీరు ఒంటరిగా ఉన్నారు. 
 
ఎవరి ప్రశంసలు.. మిమ్మల్ని అసంపూర్తిగా చేయగలవు. ఒకసారి మీరు ఇది అర్థం చేసుకుంటే.. మీ మెదడులో కాదు.. మీ మనస్పూర్తిగా మీరు స్వేచ్చగా ఉంటారు. ప్రస్తుతం మీరు గతంలో కంటే ఎక్కువగా గౌరవం పొందుతారు. మీరు సంతోషంగా ఉండటానికి ఇవి ఏమాత్రం అవసరం లేదు " అంటూ సుధీర్ఘ పోస్ట్ చేసింది సమంత.
 
ఇటీవల అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‏లో అదరగొట్టింది సమంత. ప్రస్తుతం సామ్ యశోద సినిమా షూటింగ్‏లో బిజీగా ఉంది.