సోమవారం, 25 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మే 2023 (12:41 IST)

రాజస్థాన్‌లో శర్వానంద్, రక్షితల వివాహం.. జూన్ 2న మెహందీ ఫంక్షన్

sharwanand engagement
టాలీవుడ్ నటుడు శర్వానంద్, రక్షిత నిశ్చితార్థం జరిగి ఐదు నెలలు అయ్యింది. జనవరిలో జరిగిన ఈ సాంప్రదాయ వేడుకలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
 
ఈ నేపథ్యంలో ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదన్నట్లు జూన్ 2వ తేదీన మెహందీ ఫంక్షన్ జరగాల్సి వుంది. 
 
ఆ మరుసటి రోజే లీలా ప్యాలెస్‌లో పెళ్లి కొడుకు, వివాహం జరగనుంది. శర్వానంద్, రక్షిత వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లో రెండు రోజుల పాటు వైభవంగా జరగనుంది.అతిథి జాబితా భారీగానే ఉండబోతోంది.