గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (10:37 IST)

వైఎస్ వివేకా హత్య కేసుపై శ్రీరెడ్డి ఏమన్నదంటే..?

వైఎస్ వివేకా హత్య కేసుపై శ్రీరెడ్డి స్పందించింది. ఇప్పటికే వివేకా కేసుపై అటు తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించిన టీవీ ఛానళ్లు దృష్టి సారించాయి. వరుసగా డిబేట్లు పెట్టుకుంటూ… ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో శ్రీ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అన్యాయంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని జనసేన పార్టీ అలాగే టిడిపి పార్టీ నాయకుల పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు.
 
ముఖ్యంగా పావలా కళ్యాణ్ అంటూ.. పవన్ పై మండిపడ్డారు శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ కు చెందిన ఓ మీడియా సంస్థ అనవసరంగా వైఎస్.వివేకానంద కేసుపై డిబేట్ లు పెట్టి జగన్మోహన్రెడ్డిని నిందితుడిగా చూపిస్తుంది అంటూ ఆమె నిప్పులు చెరిగారు. 
 
అలాగే టీడీపీకి చెందిన ఓ ఛానల్ కూడా ఇలాగే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీ రెడ్డి. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను మాత్రం ఈ మీడియా ఛానళ్లు ప్రసారం చేయకపోవడంపై మండిపడ్డారు. ఇలాంటి చిల్లర వేషాలు ఇకనైనా మానుకోవాలని చురకలంటించారు శ్రీ రెడ్డి.