సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (12:17 IST)

ఫిబ్రవరి 24న వస్తోన్న "వలిమై"

కోలీవుడ్ స్టార్ అజిత్ "వలిమై" సినిమా ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో "వలిమై" సందడి చెయ్యనుంది. అజిత్ ఇమేజ్‌కి తగ్గట్లు సాలిడ్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌గా రూపొందిన 'వలిమై'కి సంతోష్ నారాయణన్ సంగీతమందించారు.
 
ఇందులో టాలీవుడ్ హీరో ఆర్ఎక్స్ 100 కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ అండ్ ట్రైలర్‌కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. 
 
నిర్మాత బోనీ కపూర్, దర్శకుడు హెచ్. వినోద్‌లతో కలిసి ఈ ఫిలిం తెరకెక్కుతోంది. అజిత్ నటిస్తున్న 60వ సినిమా ఇది.. బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి ఫీమేల్ లీడ్‌‌లో కనిపించనుంది.