మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 9 మార్చి 2023 (17:38 IST)

చిత్రం చూడర అంటున్న వరుణ్ సందేశ్

Varun, kasi
Varun, kasi
వరుణ్ సందేశ్ కథానాయకుడిగా ధనరాజ్, కాశీ విశ్వనాధ్ ప్రధాన పాత్రలలో ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో  రూపొందుతున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. బిఎం సినిమాస్ బ్యానర్ పై శేషు మారంరెడ్డి, బోయపాటి బాగ్యలక్ష్మి  నిర్మిస్తున్న  ఈ సినిమాకి ‘చిత్రం చూడర’ అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో వరుణ్ సందేశ్, ధనరాజ్, కాశీ విశ్వనాధ్ ఎదో తప్పు చేసి పట్టుబడిన నిందితులుగా పోలీస్ స్టేషన్ లో కూర్చోవడం క్యురియాసిటీని పెంచుతోంది.
 
అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో  నేనింతే ఫేం అదితి గౌతమ్ ఐటెం సాంగ్ స్పెషల్ అప్పియరెన్స్ లో అలరించనున్నారు.
 
ధన తుమ్మల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఉన్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది. ట్యాలెంటెండ్ టాప్ టెక్నిషియన్స్ అయిన  రాధన్ సంగీతం అందిస్తుండగా, జవహర్ రెడ్డి డీవోపీగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
 
తారాగణం: వరుణ్ సందేశ్, శీతల్ భట్, రవిబాబు అల్లరి, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, ధనరాజ్, కాశీ విశ్వనాథ్, శివాజీ రాజా, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ, అదితి గౌతమ్ (స్పెషల్ అప్పిరియన్స్) రచ్చరవి, కేఏ పాల్ రాము, పింగ్‌పాంగ్ సూర్య, రైజింగ్ రాజు తదితరులు.