శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 9 సెప్టెంబరు 2019 (20:29 IST)

ఎట్ట‌కేల‌కు వినాయ‌క్‌కి హీరో దొరికాడా..?

డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ఖైదీ నెం 150 త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్‌తో ఇంటిలిజెంట్ అనే సినిమా తీసారు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఆ త‌ర్వాత బాల‌య్య‌తో వినాయ‌క్ సినిమా తీయాలి అనుకున్నారు. క‌థపై చాలా క‌స‌ర‌త్తు చేసారు కానీ... బాల‌య్య మాత్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. దీంతో వినాయ‌క్ మెగాఫోన్ ప‌క్క‌న పెట్టి హీరోగా మారి సినిమా చేస్తున్నాడు. 
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.... ఎట్ట‌కేల‌కు వినాయ‌క్‌కి హీరో దొరికాడ‌ట‌. ఇంత‌కీ ఎవ‌రా హీరో అంటారా..? ఇస్మార్ట్ శంక‌ర్. అదేనండి ఎన‌ర్జిటిక్ హీరో రామ్. ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ సినిమా తరువాత ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయవలసి వుంది. 
 
అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి కొంత సమయం పడుతుందని తెలుస్తోంది. ఎందుకంటే... రామ్ మాస్ టచ్ వున్న పాత్రనే చేయాలనుకుంటున్నాడ‌ట‌. ఇటీవ‌ల వినాయక్ చెప్పిన క‌థ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ఇందులో మాస్ మసాలా అంశాలు పుష్కలంగా వున్నాయ‌ని తెలిసింది. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇదే క‌నుక నిజ‌మైతే.... ఈ డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ రామ్‌ని ఎలా చూపించ‌నున్నాడో..?