ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2024 (16:41 IST)

తెలుగు భాషపై సత్యరాజ్ కు ఎంతప్రేమో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

eeswar kartik, Sathyaraj
eeswar kartik, Sathyaraj
సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ చిత్రం  'జీబ్రా'. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు. కాగా, సినిమా ప్రమోషన్ లో సత్యరాజ్ పాల్గొన్నారు. ఆయన ఇందులో టిపికల్ పాత్ర పోషించారు. చిత్ర దర్శకుడు తమిళుడైనా తెలుగు నేర్చుకుని మాట్లాడడం విశేషం. ఇక కన్నడ నటుడు ధనుంజయ కూడా తెలుగు నేర్చుకుని మాట్లాడాడు. కానీ సీనియర్ నటుడు సత్యరాజ్ ఉరఫ్ కట్టప్ప మాత్రం ఒక్క ముక్క కూడా తెలుగు మాట్లాడకుండా తమిళంలోనూ మాట్లాడడం విశేషం.
 
ఈ విషయంపై ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. ఎంతో సీనియర్ అయిన మీరు హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. మీ కొడుకును కూడా తెలుగువారికి నటుడిగా పరిచయం చేశారు. అయినా మీరెందుకు తెలుగు నేర్చుకోలేకపోయారు? అన్న విలేకరి ప్రశ్నకు మొదట ఏదో సంబంధంలేని టాపిక్ మాట్లాడారు. కానీ మరలా వివరంగా చెబితే... నాకు ప్రామిటింగ్ చెప్పేవారు కావాలి. నాకు తెలుగురాదు. సెట్లో ప్రామిటింగ్ చెబుతారు. డబ్బింగ్ కూడా ప్రామిటింగ్ ద్వారానే చెబుతాను. అంటూ...
 
లోగడ ఓ సినిమాలో నేను లీడ్ రోల్ డాన్స్ చేయాలి. డాన్స్ మాస్టర్ సెట్ కు వచ్చాక డాన్స్ ప్రాక్టీస్ చేశారా? అని అడిగాడు. లేదు.  మరి ఎలా డాన్స్ చేస్తారు? అన్నాడు. మీరు చెప్పండి చూసి చేస్తాను అన్నాను. అదేమిటి?  ఆడియన్స్ ను మెప్పించాలంటే డాన్స్ సరిగ్గా చేయాలిగదా? అన్నాడు. అది వాళ్ళు చూసుకుంటారు.  నాకు వచ్చినంతే చేస్తా. చూస్తే చూస్తారు. లేదంటే లేదు అన్నట్లుగా చెప్పా. అందుకు ఓకే అని చేయడం జరిగింది. అంటూ చిన్న కథ చెప్పాడు. 
 
సో.. తెలుగుతో బాహుబలితో కట్టప్ప పాత్ర ద్వారా ప్రపంచానికి బాగా తెలిసిన ఈ సత్యరాజ్ తెలుగు నేర్చుకుంటానని అస్సలు అనలేదు. ఆమధ్య ప్రభాస్ మిర్చి సినిమాలోనూ ఇదే పరిస్థితి వస్తే.. నేను ప్రామిటింగ్ వుంటేనే నటిస్తానని అన్నడట. అదే కను తెలుగు నటుడు తమిళంలో ఈ మాట అంటే వెంటనే మరో తమిళ నటుడ్ని పెట్టేసేవారు.  తెలుగు నిర్మాత, దర్శకులు పరబాషా నటుల్ని ఎంకరేజ్ చేయాలనే కంకణం కట్టుకున్నవారు కనుక సత్యరాజ్ లాంటి నటుల్ని ఎలిగిపోతున్నారు.  ఒకరకంగా చూస్తే, సత్యరాజ్ ధోరణి రామ్ గోపాల్ వర్మను పోలివుంటుంది.