శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 16 జనవరి 2020 (19:13 IST)

లేట్‌గా వస్తే ఇంటికి పంపించేస్తానన్నారుగా...

క్లాసు ప్రారంభమైన తర్వాత రాజు వేగంగా వస్తూ... మే ఐ కమిన్ మిస్ అన్నాడు.
దాంతో టీచర్... ఏరా రాజు, లేట్ గా ఎందుకు వచ్చావ్ అని అడిగింది.
రాజు: మీరేకదా టీచర్...! లేట్‌గా వచ్చిన వాళ్ళని ఇంటికి పంపించేస్తానన్నారు అన్నాడు ఠక్కున.
 
 
2
పరీక్ష ముగిశాక ఇద్దరు పిల్లలు ప్లే గ్రౌండులో కొట్టుకోవాడన్ని చూసిన టీచర్ ఇలా అడిగింది.
టీచర్: ఎందుకురా ఇద్దరూ కొట్టుకుంటున్నారు?
గిరి: వీడు పరీక్షాపత్రం ఖాళీగా వదిలాడు...
టీచర్: ఐతే?
గిరి: నేను కూడా పేపరంతా ఖాళీగా వదిలాను.
టీచర్: అందుకు కొట్టుకోవాలా?
గిరి: పేపర్ కరక్షన్ చేసేటప్పుడు వాడి దగ్గర నేను కాపీ కొట్టాననుకుంటారుగా... అందుకే అన్నాడు.