బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By srinivas
Last Modified: శుక్రవారం, 10 ఆగస్టు 2018 (19:48 IST)

నవంబర్ 8న నిఖిల్ "ముద్ర"

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ "ముద్ర". టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతుండడం విశేషం. అలాగే.. కరెంట్ ఇష్యుస్ సాల్వ్ చేయడంలో మీడియా ఎటువంటి కీలకపాత్ర పోషిస్తుంద

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ "ముద్ర". టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతుండడం విశేషం. అలాగే.. కరెంట్ ఇష్యుస్ సాల్వ్ చేయడంలో మీడియా ఎటువంటి కీలకపాత్ర పోషిస్తుంది అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా చూపించనున్నారు. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. సెప్టెంబర్ కల్లా షూటింగ్ పూర్తిచేసి నవంబర్ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 
 
నిఖిల్ ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది, అతడు జర్నలిస్టుగా నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కావ్య వేణుగోపాల్-రాజ్ కుమార్ ఔరా సినిమాస్ ప్రయివేట్ లిమిటెడ్-మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బి.మధు సమర్పిస్తున్నారు. నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోరా, సత్య, నాగినీడు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: టి.ఎన్. సంతోష్, నిర్మాతలు: కావ్య వేణుగోపాల్-రాజ్ కుమార్, కెమెరా: సూర్య, సంగీతం: సామ్ సి.ఎస్; ఆర్ట్: సాహి సురేష్, ఫైట్స్: వెంకట్, కాస్ట్యూమ్ డిజైనర్: రాగారెడ్డి, డైరెక్షన్ డిపార్ట్మెంట్: రమా రమేష్, రఘునాధ్, లోకేష్, భరత్, అరుల్, బ్రహ్మపబ్లిసిటీ డిజైనర్: అనిల్-భాను, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్.