సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 29 మే 2021 (18:03 IST)

అడివి శేష్ రిలీజ్ చేసిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ వీడియో సాంగ్ (video)

Adit Arun, Shivani Rajasekhar
‘118’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న లేటెస్ట్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు,ఎక్కడ, ఎందుకు). అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో ప్రజలు  ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత తరుణంలో అందరిలో చిన్న పాటి ధైర్యాన్ని తీసుకురావడానికి ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ యూనిట్‌ ఇటీవల లాక్‌డౌన్‌ ర్యాప్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. రోల్ రైడా పాడిన ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. 
 
తాజాగా ఈ చిత్రంలోని ‘‘కన్నులు చెదిరే...’లిరికల్ వీడియో సాంగ్ ను యంగ్ హీరో అడవి శేష్‌ విడుదల చేసి చిత్రయూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ‘‘కన్నులు చెదిరే అందాన్ని..వెన్నెల తెరపై చూశానే, కదిలే కాలాన్నే నిమిషం నిలిపేశానే..నన్నిక నీలో విడిచానే, నిన్నలు గాల్లో కలిపానే..ఇప్పుడే నేనింకోల మళ్ళీ పుట్టానే..’’ అంటూ ఈ సాగే ఈ రొమాంటిక్‌ మెలోడీ శ్రోతలను ఆకట్టుకుంటుంది. అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించిన ఈ గీతాన్ని యాజిన్‌ నిజార్‌ ఆలపించారు. సైమన్‌ కె కింగ్‌ స్వరాలు సమకూర్చారు..
 
చిత్ర దర్శకుడు కేవి గుహన్‌ మాట్లాడుతూ, ఇది ఫస్ట్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ తెలుగు మూవీ. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తప్పకుండా థ్రిల్లర్‌ జోనర్‌లోనే ఇది ఒక డిఫరెంట్‌ మూవీగా నిలుస్తుంది’’అన్నారు.
 
చిత్ర నిర్మాత డా.రవి పి.రాజు దాట్ల మాట్లాడుతూ, "మా రామంత్ర క్రియేష‌న్స్ బేన‌ర్‌లో రూపొందుతోన్న ఫ‌స్ట్ మూవీ ఇది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రిలీజ్ చేసిన టీజర్, స్టార్ హీరోయిన్ తమన్నా రిలీజ్ చేసిన నైలు నది సాంగ్ కి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. రీసెంట్ గా రిలీజైన లాక్ డౌన్ ర్యాప్ సాంగ్ కి  కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కన్నులు చెదిరే సాంగ్ ను యంగ్ హీరో అడివిశేష్ విడుదల చేయడం హ్యాపీ గా ఉంది. ఈ సందర్భంగా మా రామంత్ర క్రియేషన్స్ తరపున అడివిశేష్ గారికి  దన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ చక్కగా నటించారు. గుహ‌న్ గారు ఈ సినిమాని అద్బుతంగా తెర‌కెక్కించారు. తప్పకుండా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది`` అన్నారు
 
కో – ప్రొడ్యూసర్‌ విజయ్‌ ధరన్‌ దాట్ల మాట్లాడుతూ,‘‘గుహన్‌ గారు ఈ చిత్రాన్ని సూపర్‌హిట్‌ చేయడానికి చాలా డెడికేటెడ్‌గా వర్క్‌ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ స్పీడ్‌గా జరుగుతోంది. ఈ కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తాము" అన్నారు.
 
అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి..
బ్యానర్‌: రామంత్ర క్రియేషన్స్
సంగీతం: సైమన్‌ కె. కింగ్,
ఎడిటింగ్‌: తమ్మిరాజు,
ఆర్ట్‌: నిఖిల్‌ హాసన్
డైలాగ్స్‌: మిర్చి కిరణ్,
లిరిక్స్‌: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, రోల్‌రైడా
కొరియోగ్రఫి: ప్రేమ్‌ రక్షిత్,
స్టంట్స్‌: రియల్‌ సతీష్,
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: పొన్మని గుహన్
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: కె. రవి కుమార్,
కో–ప్రొడ్యూసర్‌: విజయ్‌ ధరణ్‌ దాట్ల,
నిర్మాత: డా. రవి పి.రాజు దాట్ల,
కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్