శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : ఆదివారం, 21 అక్టోబరు 2018 (14:49 IST)

ఉజ్జయిని మహాకాళి ఆలయాన్ని పేల్చేస్తాం : పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు

ఉజ్జయిని మహాకాళి ఆలయాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తామని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రటించారు. ఈ మేరకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కర్‌ ఈ తోయిబా ఓ లేఖను విడుదల చేసింది. దీంతో ఆలయం వద్ద గట్టి బద్రతను ఏర్పాటుచేశారు.
 
లష్కర్ ఏరియా కమాండర్ మౌల్వి అబు షేక్ పేరిట పాకిస్థాన్‌లోని రావల్పిండి నుంచి ఈ లేఖ విడుదలైంది. జైపూర్‌లోని రైల్వే అధికారులు సెప్టెంబరు 29వ తేదీన ఈ లేఖను అందుకున్నారు. అక్టోబరు 20, నవంబర్ 9వ తేదీల్లో దాడులు చేస్తామని అందులో రాశారు. ఈ దాడులు మధ్యప్రదేశ్‌తోపాటు రాజస్థాన్, గుజరాత్‌లలోనూ దాడులు చేస్తామని అందులో పేర్కొనడం గమనార్హం. అయితే ఇప్పటికే అక్టోబర్ 20 ఎలాంటి దాడుల్లేకుండా గడిచిపోవడంతో నవంబర్ 9పై దృష్టిసారించారు. 
 
మధ్యప్రదేశ్‌లోని భోపాల్, గ్వాలియర్, కత్ని, జబల్‌పూర్ రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం కనిపిస్తోంది. డిసెంబరు నెలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు రావడం ఆందోళన కలిగిస్తున్నది. ముంబైలో 2008లో జరిగిన దాడులను కూడా ఈ లష్కరే తోయిబానే చేసింది. 10 మంది ఉగ్రవాదులు 2008, నవంబర్ 26 నుంచి 29 మధ్య ఈ దాడులు చేశారు. ఇందులో 166 మంది చనిపోగా, 300 మందికిపైగా గాయపడ్డారు. వీళ్లలో 9 మంది ఉగ్రవాదులను దాడుల సమయంలోనే కాల్చి చంపగా.. అజ్మల్ కసబ్‌ను తర్వాత ఉరి తీసిన సంగతి తెలిసిందే.