గురువారం, 28 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By pnr
Last Updated : మంగళవారం, 27 జూన్ 2017 (11:00 IST)

అన్న ఇంటిని తమ్ముడు కొనచ్చా?

ఆస్తులు, పొలాలు అమ్మకాల్లో కూడా తోడపుట్టిన అన్నదమ్ముల్లో కొందరు వాస్తు నియమాలు పాటిస్తుంటారు. పెద్దోడి ఆస్తిపాస్తులను చిన్నోళ్లు కొనుగోలు చేయరాదని అనేక మంది చెపుతుంటారు. నిజంగా అన్న ఇంటిని తమ్ముడు కొన

ఆస్తులు, పొలాలు అమ్మకాల్లో కూడా తోడపుట్టిన అన్నదమ్ముల్లో కొందరు వాస్తు నియమాలు పాటిస్తుంటారు. పెద్దోడి ఆస్తిపాస్తులను చిన్నోళ్లు కొనుగోలు చేయరాదని అనేక మంది చెపుతుంటారు. నిజంగా అన్న ఇంటిని తమ్ముడు కొనచ్చా? లేదా? అనే అంశాన్ని పరిశీలిస్తే...
 
ఇద్దరు అన్నదమ్ములు వేరువేరుగా కాపురం చేస్తున్నప్పుడు ఎవరి ఇల్లు ఎవరైనా కొనుక్కోవచ్చు. పక్కపక్కనే ఇండ్లు కట్టుకొని ఉంటే అన్న అయినా, తమ్ముడు అయినా తను ఉండే ఇంటికి దక్షిణం లేదా పడమర ఇల్లు కొనవద్దు. 
 
ఒకే ఇంట్లో ఉంటూ అన్న అయినా తమ్ముడు అయినా తన వంతు ఆస్తిని ఇచ్చుకోవచ్చు. అయితే ఆ గృహం వాస్తుపరంగా ఉందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. దోషాలు ఉంటే సవరించుకోవాలి. అంతేగానీ అన్న పెద్దవాడు కదా అని కొనకూడదు అనే నియమం లేదు. అయితే ఎవరు ఎవరికి అమ్మినా పూర్తి హక్కులు కొన్న వారికి కల్పించాల్సి ఉంటుంది.